: తొలిసారి గృహరుణం తీసుకునేవారికి లక్ష రాయితీ: చిదంబరం
తాజా బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక మంత్రి చిదంబరం కనికరం చూపారు. తొలిసారి గృహరుణం తీసుకునేవారికి లక్ష రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. పొదుపు పథకాలు మరింత ప్రోత్సాహకరంగా ఉండేట్టు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కాగా, 2013-14 ఏడాదికి గాను పన్ను రహిత బాండ్ల ద్వారా రూ. 50 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. చెన్నై-బెంగళూరు కారిడార్ ను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ తోనూ అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు.