: గుండెకు కొత్త వైద్యం


గుండె ఏదైనా వ్యాధులకు గురైనప్పుడు దానికి మరమ్మత్తులు చేయడానికి వైద్యులు వివిధ విధానాలను ఉపయోగిస్తుంటారు. అలాగే పాడైపోయిన కణజాలం స్థానంలో సరికొత్త కణజాలాన్ని ఏర్పాటు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పీచును కణజాలం స్థానంలో అమర్చి గుండె తిరిగి మామూలుగా పనిచేయడానికి సహకరించేలా చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పీచును స్ప్రింగులా తయారుచేసి ఉపయోగించడం ఇక్కడ ప్రత్యేకం. ఈవిధంగా చేయడం వల్ల దీని పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో కణజాలాన్ని పీచుపదార్ధంతో నేరుగా తయరుచేసేవారు. అలాకాకుండా పీచును స్ప్రింగు ఆకారంలో రూపొందించి దాన్ని ఉపయోగించడం వల్ల దీని పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయిల్‌లోని టెల్‌అవెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్తలు టాల్‌ డివిర్‌, షరోన్‌ ఫ్లెస్చర్‌, రాన్‌ ఫెయినర్‌లు వ్యాధులకు గురైన గుండె తిరిగి మామూలుగా పనిచేయడానికి తోడ్పడే కణజాలాన్ని స్ప్రింగులాంటి పీచుపదార్ధంతో తయారుచేశారు. పీచుపదార్ధం స్ప్రింగు ఆకారంలో ఉండడం వల్ల కణజాలం కుచించుకుపోకుండా నిరోధిస్తుందని, అంతేకాకుండా హృదయ కండరాల సంకోచ వ్యాకోచాలకు అనుకూలంగా ఉంటుందని అధ్యయనకర్తల్లో ఒకరైన టాల్‌ డివిర్‌ చెబుతున్నారు. రోగుల గుండెలోని కణాల ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ కణజాలాన్ని శస్త్ర చికిత్స ద్వారా రోగి గుండెలోని పాడయిన కణాల స్థానంలో అమర్చవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News