: క్యూలో నిమ్మగడ్డ, బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటీషన్లు
జగన్ విడుదల అవడంతో క్యూలోకి నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలు బెయిల్ కోసం సీబీఐ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. సుమారు 16 నెలలుగా తాము జైలు శిక్ష అనుభవిస్తున్నామని, సీబీఐ దర్యాప్తు ముగిసినందున తమకు బెయిల్ మంజూరు చేయాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. ముందు నుంచీ తాము సీబీఐ దర్యాప్తుకు సహకరిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సహకరిస్తామని, కోర్టు ఏ షరతులు విధించినా పాటిస్తామని వారు కోర్టుకు తెలిపారు. దీంతో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిల పిటిషన్లపై అభిప్రాయం తెలపాలని సీబీఐని ఆదేశించిన కోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.