: జగన్ మా వాడే, కాంగ్రెస్ లోకే తిరిగొస్తాడు: శంకర్రావు
వైఎస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో వేరుకుంపటి పెట్టుకున్న జగన్ కాంగ్రెస్ పార్టీలో కలుస్తారని మాజీ మంత్రి శంకర్రావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బీజేపీ వెంట వెళ్ళే ప్రసక్తేలేదని ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి జగన్ బెయిల్ కు సంబంధం లేదని, అలాంటి ప్రచారం సరికాదని హితవు పలికారు. భవిష్యత్తులో జగన్, తాము కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.