: నిదానంగా సాగుతున్న జగన్ కాన్వాయ్
జైలు నుంచి విడుదలైన జగన్ ను చూసేందుకు అభిమానులు విశేషంగా తరలివచ్చారు. చంచల్ గూడ జైలు వద్దే కాక, ఆయన నివాసానికి చేరుకునే రూట్ లోనూ భారీ జనసందోహం కనిపిస్తోంది. దీంతో, జగన్ వారందరికీ అభివాదం చేస్తూ రావడంతో ఆయన కాన్వాయ్ నిదానంగా సాగుతోంది. రహదారులు కిక్కిరిసిపోయాయి. అభిమానులు రోడ్లకిరువైపులా బారులు తీరారు.