: జైలు వద్ద తొక్కిసలాట
బెయిల్ పై విడుదలైన జగన్ ను చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో చంచల్ గూడ జైలు వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. లాంఛనలాన్నీ పూర్తి చేసుకుని మెయిన్ గేటు నుంచి జగన్ వెలుపలికి రాగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురేగి ఆయనను చుట్టుముట్టారు. జగన్ తో కరచాలనానికి పోటీపడ్డారు. జై జగన్ అన్న నినాదాలతో చంచల్ గూడ జైలు పరిసరాలు మార్మోగిపోయాయి.