: అదే జరిగితే భారత క్రికెట్ భ్రష్టుపట్టడం ఖాయం: లలిత్ మోడీ


ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ.. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసన్ పై విరుచుకుపడ్డారు. బోర్డుపై తన పట్టు నిలుపుకునేందుకు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలని శ్రీనివాసన్ నిర్ణయించుకోవడంపై మోడీ స్పందిస్తూ.. శ్రీనివాసన్ మరోసారి ఎన్నికైతే భారత క్రికెట్ భ్రష్టుపట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తే.. ప్రకటనదారులు, ఆయా దేశాల క్రికెట్ బోర్డులు, క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశపడతారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల క్రికెట్ బోర్డులు ఆయనకు వంతపాడడం మానుకోవాలని హితవు పలికారు. ఇదిలావుంటే.. శ్రీనివాసన్ ను బీసీసీఐ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడాలని బీహార్ క్రికెట్ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News