: దిలీప్ కుమార్ ను పరామర్శించిన బిగ్ బి


బాలీవుడ్ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ ను అమితాబ్ బచ్చన్ నేడు పరామర్శించారు. గత కొన్నిరోజులుగా దిలీప్ కుమార్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారం క్రితం గుండె నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, దిలీప్ కుమార్ ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఉదయం అమితాబ్ పరామర్శించగా.. దిలీప్ తో అమితాబ్ ఫొటోను వారు సోషల్ మీడియాలో పెట్టారు. ఐసీయూ నుంచి వెలుపలికి రావడం, అమితాబ్ వచ్చి పరామర్శించడం సంతోషదాయకమని దిలీప్ కుమార్ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News