: జాతి చరిత్రలోనే జగన్ కేసు ప్రత్యేకం: జేపీ
లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అక్రమాస్తుల కేసులో జగన్ కు బెయిల్ లభించడంపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తెలుగుజాతి చరిత్రలోనే జగన్ కేసు ప్రత్యేకమైనదని అభివర్ణించారు. ఏడాది పాటు జైలులో ఉంచి విచారణ పేరిట కేసును మరో పదేళ్ళు సాగదీయడం సరికాదన్నారు. ఇలాంటి కేసులు సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.