: 5 కోట్ల మంది కోరుకుంటున్నది ఎందుకు సాధ్యంకాదో చెప్పాలి: ఎంపీ అనంత
అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అంటూ రాష్ట్ర విభజన ప్రకటనపై సర్ది చెబుతున్న సీఎం, పీసీసీ చీఫ్ లు రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం ఉందని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. 5 కోట్ల మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు సమైక్యమే కోరుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.