: రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం: లగడపాటి
మళ్లీ కలిసే విషయమై స్పీకర్ రెండు రోజుల్లో సమాచారమిస్తామన్నారని, తమ రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అపాయింట్ మెంట్ క్యాన్సిల్ కాలేదన్నారు. అనివార్య కారణాలవల్ల స్పీకర్ కలవలేదని తెలిపారు. స్పీకర్.. కార్యాలయానికి వచ్చి ఉంటే కలిసి ఉండేవారమని అన్నారు. లేనిపోని ఆరోపణలు చేయకుండా తాము రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. తమలో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన బాధ్యతప్రకారం మమ్మల్ని వెనక్కి తగ్గమని కోరారని చెప్పారు. అయినప్పటికీ తమ స్టాండ్ మారలేదని ఆయన అన్నారు. వర్కింగ్ కమిటీ ప్రకటన రోజే తాను రాజీనామా నిర్ణయం వెలిబుచ్చానని ఆయన అన్నారు.