: 13 జిల్లాల్లో ఉద్ధృతంగా సమైక్యాంధ్ర బంద్


సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉద్ధృతంగా బంద్ జరుగుతోంది. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో 13 జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా మరే కార్యకలాపాలు జరగడం లేదు. వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులకు సాధారణ పౌరులు కూడా జత కలిసి విభజనకు వ్యతిరేకంగా గొంతెత్తారు. రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలు బంద్ తో స్తంభించిపోయాయి. ఉద్యమకారులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరగదు అంటూ కేంద్రం ప్రకటించేవరకు ఉద్యమం ఆగదని వారు నినదిస్తున్నారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటికి పంపేశారు.

  • Loading...

More Telugu News