: లోటస్ పాండ్ వద్ద కోలాహలం
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మరికాసేపట్లో విడుదల కానుండడంతో హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఆయన నివాసం వద్ద భారీ కోలాహలం నెలకొంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్ కుటుంబ అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. జగన్ కు స్వాగతం పలికేందుకు వారు ఉద్విగ్నతతో ఎదురుచూస్తున్నారు. దీంతో, అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది.