: నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
వరంగల్ జిల్లాలోని గణపురంలో నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కన్నులపండుగగా జరగనున్నాయి. ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు పేరిణి, జానపద నృత్యాలు, బుర్ర కథ, ఒగ్గు కథలు, యక్షగానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.