: కృష్ణబిలం ఎప్పుడు పేలిందంటే...
విశ్వంలో చాలా విషయాలు ఎప్పుడూ ప్రశ్నార్ధకాలే... అలాగే కృష్ణబిలం ఎప్పుడు పేలివుంటుంది? అనే విషయం ఇంతకాలంగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉండేది. ఇప్పుడు లక్షల ఏళ్ల క్రితమే కృష్ణబిలం పేలిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అగ్నిపర్వతం రూపంలో ఉండే భారీ కృష్ణబిలం సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం బద్దలైవుంటుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా నిర్ధారించారు. మన పాలపుంత గెలాక్సీ మధ్యలో నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం తరహాలోని భారీ కృష్ణబిలం ఎప్పుడో బద్దలైవుంటుందని గతంలో భావించిన శాస్త్రవేత్తలు ఎప్పుడు బద్దలైవుంటుంది అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు వాయువులతో కూడిన మ్యాగెలానిక్ స్ట్రీమ్ నుండి సేకరించిన ఆధారాలను పరిశీలించి ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఈ కృష్ణబిలం బద్దలైవుంటుందని సమయాన్ని నిర్ధారించారు.