: బాలభీముడికి అరుదైన చికిత్స


రెండేళ్ల వయసుకే 33 కేజీల బరువు పెరిగిన ఒక బాలుడికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సాధారణంగా రెండు సంవత్సరాల వయసుకు పిల్లలు పెద్ద బరువు పెరగరు. అయితే ఏకంగా 33 కేజీల బరువు పెరిగి, విపరీతమైన స్థూలకాయంతో, దానిద్వారా సంక్రమించిన పలు అనారోగ్యాలతో సతమతమవుతున్న ఒక బాలుడికి గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ అనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో ఆ బాలుడు కొంతమేర ప్రాణాపాయ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అంతేకాదు, అరుదైన ఈ చికిత్స చేయించుకున్న అతి పిన్న వయస్కుడుగా ఈ బాలుడు రికార్డు సృష్టించాడు కూడా.

రెండేళ్ల వయసుకే అధిక బరువు పెరగిన కారణంగా ఆ బాలుడి కాళ్లు వంగిపోయాయి. నిద్రలో ఊపిరి తీసుకోవడం కూడా దాదాపుగా ఆగిపోవడం మొదలుపెట్టింది. దీంతో కలవరపడిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా వారు గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీని సూచించారు. ఈ సూచన మేరకు తల్లిదండ్రులు ఈ బాబుకు జీర్ణాశయానికి సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స చేయించారు.

  • Loading...

More Telugu News