: సమైక్యాంధ్ర ఉద్యమానికి విద్యార్థులే స్ఫూర్తి: అశోక్ బాబు
సమైక్యాంధ్ర ఉద్యమానికి విద్యార్థులే స్ఫూర్తని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2009లో తెలంగాణ ప్రకటన వెలువడగానే ముందుగా స్పందించింది యూనివర్సిటీల్లోని విద్యార్థులేనని అన్నారు. ఆనాటి విద్యార్థుల ఉద్యమమే తమకు పాఠాలు నేర్పిందని, చివరివరకు ఎలా ఉద్యమించాలన్న విషయాలపై విద్యార్థులే తమకు ప్రేరణ అని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ముందుగా నష్టపోయేది విద్యార్థులేనని ఆయన అన్నారు.