: సోనియా పేరుతో అటార్నీ జనరల్ కు ఫోన్ కాల్


తాను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీనని, సుప్రీం కోర్టు విచారణలో ఉన్న పలు కేసుల వివరాలు కావాలని ఓ మహిళ అటార్నీ జనరల్ జి. వాహనవతికి ఫోన్ చేసింది. అయితే ఆ తర్వాత ఆ కాల్ నకిలీదని తేలింది. కొన్ని కీలకమైన కేసులకు సంబంధించి వాహనవతితో మాట్లాడిన ఆ మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయివుంటుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళ ఈనెల 5, 11 తేదీల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఓ న్యాయవాదితోనూ ఫోన్లో మాట్లాడిందని పోలీసులు తెలిపారు. కాగా, వాహనవతికి సదరు నకిలీ సోనియా ఫోన్ చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి చికిత్స కోసం అమెరికాలో ఉన్నారు. ఈ ఫోన్ కాల్ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News