: చాంపియన్స్ లీగ్ మ్యాచ్ కు వానపోటు
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో భాగంగా ఈ రోజు అహ్మదాబాద్ లో జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో హైవెల్డ్ లయన్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.