: సీమాంధ్ర నేతలకు బుర్ర లేదు: కేసీఆర్


సీమాంధ్ర నేతలకు బుర్ర లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ కొత్తగా ప్రకటించింది కాదని, ఎప్పటినుంచో ఉన్నదేనని అన్నారు. ఐదారేళ్ల క్రితమే ఐటీ పెట్టుబడులకు హైదరాబాదు అనువైన ప్రాంతమని ప్రపంచస్థాయి సీఈవోలు చెప్పారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, పుణేలు ఐటీ పెట్టుబడులకు బాగా అనుకూలంగా ఉన్నాయన్నారు. బాబు, వైఎస్ హయాంలో ఐటీ పేరిట భూముల దందా చేశారని ఆరోపించారు. అలాగే, మేధావినని చెప్పుకుని తిరిగే జయప్రకాశ్.. హైదరాబాదులోనే అభివృద్ధి అంతా ఎందుకు కేంద్రీకరిస్తున్నారని అడుగుతాడని, ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటాడని దుయ్యబట్టారు. వీరిద్దరూ బుర్రలేని వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News