: ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ హబ్ ప్రకటన బాధాకరం: ఎన్ఆర్ఐలు
రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఐటీ హబ్ గా ప్రకటించడం హర్షించదగిన విషయమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటన చేయడం బాధాకరమని ఏన్ఆర్ఐలు వ్యాఖ్యానించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై స్పష్టత లేని ప్రస్తుత పరిస్థితుల్లో 50 వేల ఎకరాల్లో రూ.4863 వేల కోట్లతో ఐటీ హబ్ ను అభివృద్ధి చేయాలనుకోవడం ఏ రకంగా సమంజసమో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజనకు పరిష్కారం చూపించకుండా ఐటీ హబ్ ను కేంద్రం ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడేనని స్పష్టం చేశారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలంటే రాష్ట్రంలోని వేరే ప్రాంతానికి ఐటీ హబ్ తరలించాలని కోరారు.