: శోభారాణి ప్రధాన పాత్రధారిగా 'జై బోలో సమైక్యాంధ్ర'


అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మహిళానేతగా అనేక సందర్భాల్లో తన వాయిస్ ను గట్టిగా వినిపించిన శోభారాణి ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ చిత్రం పేరు 'జై బోలో సమైక్యాంధ్ర'. పి.వెంకట్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పూడి లక్ష్మణ్ దర్శకుడు. ఈ సినిమా ప్రెస్ మీట్ నేడు హైదరాబాదులో జరిగింది. దర్శక నిర్మాతలతో పాటు శోభారాణి, కవిత తదితరులు పాల్గొన్నారు. కవిత ఈ సినిమాలో లేడీ గద్దర్ లాంటి పాత్రలో నటిస్తోంది.

కాగా, ప్రెస్ మీట్ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ, తాను నిజజీవిత పాత్రనే సినిమాలోనూ పోషిస్తున్నట్టు తెలిపింది. దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా ఎవరినీ కించపరచబోమని చెప్పారు. రాష్ట్రం కలిసుంటే లాభాలేంటి? విడిపోతే నష్టాలేంటి? అన్న విషయాలను తమ సినిమాలో పొందుపరిచామని వివరించారు. కాగా, కవిత మాట్లాడుతూ.. చెన్నైలో జరుగుతున్న వందేళ్ళ సినిమా వేడుకలకు తనను పిలవకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News