: జగన్ ను కలిసిన కాటసాని


బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైలులో కలిశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీ చేరిన తర్వాత మొదటిసారిగా ఆయన జగన్ ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. వైఎస్ పథకాలు ప్రజలకు అందాలంటే అది జగన్ వల్లే సాధ్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News