: విభజన తర్వాతే సమస్యలను పరిష్కరించాలి: కోదండరాం
రాష్ట్రాన్ని విభజించిన తర్వాతే ఇరు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కేంద్రం సిద్ధమవ్వాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఖమ్మంలోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన నిర్ణయానికి కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.