: డీజీపీ పిటిషన్ పై విచారణ వాయిదా
తన పదవీకాలం పెంచాలంటూ డీజీపీ దినేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను క్యాట్ వాయిదా వేసింది. అంతకుముందు ఈ విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెల 25న ఆయన పదవీకాలాన్ని పొడిగించే విషయాన్ని వెల్లడిస్తామని క్యాట్ కు తెలిపింది. దీంతో, విచారణను వాయిదా వేస్తున్నట్టు క్యాట్ పేర్కొంది. కాగా, దినేశ్ రెడ్డి పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది.