: అతిచేస్తే మతిపోతుందట...!


ఇప్పుడు ఎక్కడ చూసినా యువత ఆన్‌లైన్‌లో మునిగితేలుతోంది. అందునా ఎక్కువమంది సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లతో తలమునకలై ఉన్నారు. కొందరు తమకు కావాల్సిన సమాచారం కోసం ఇలా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో గాలింపులు సాగిస్తుంటే... మరికొందరు ఇతర విషయాలకోసం ఇలాంటి వెబ్‌సైట్లలో వెదుకుతుంటారు. ఇలా ఎక్కువసేపు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లలో గడిపేవారికి త్వరలోనే మతిమరుపు వచ్చే ప్రమాదముందట.

కొద్దిసేపు కూడా విరామం లేకుండా సోషల్‌ మీడియాలో ఎక్కుగా కాలం గడిపేవారికి క్రమేపీ జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదముందట. కేటీహెచ్‌ రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నేటి యువత ఎక్కువగా ఆన్‌లైన్‌లో సోషల్‌ మీడియాలో గడుపుతుంటారు. ఇలా ఎక్కువ సమయం గడిపేవారికి జ్ఞాపకశక్తి మందగిస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఇలాంటి వెబ్‌సైట్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల దానికి సంబంధించిన ఎక్కువ సమాచారం మెదడుకు చేరుతుంది. విరామం లేకుండా ఇలా ఎక్కువ మొత్తంలో సమాచారం చేరడం వల్ల మెదడుకు స్వల్పకాలికంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News