: పచ్చబొట్టుతో ప్రమాదమే...!


ఇప్పుడు ఎక్కడ చూసినా యువత ఒంటిపైన టాటూలుగా చెప్పుకునే పచ్చబొట్లు దర్శనమిస్తున్నాయి. వివిధ రకాల బొమ్మలు, ఆకారాలతో టాటూలను వేయించుకునేందుకు యువత తెగ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇలా టాటూలను వేయించుకునేవారికి శాస్త్రవేత్తలు ఒక హెచ్చరిక చేస్తున్నారు. టాటూలు వేయించుకోవడం వల్ల క్యాన్సరు వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు టాటూ ప్రియులను హెచ్చరిస్తున్నారు.

టాటూలను వివిధ రంగులలో, వివిధ రకాలైన ఆకారాలను వేయించుకోవడం ఇప్పటి యువతకు ఫ్యాషనైపోయింది. ఇలా పలు రకాలైన రంగులను వేయించుకోవడంలో ఆయా రంగుల ఇంకుతో వాడడం సహజంగా జరుగుతుంది. ఈ ఇంకులు విషపూరితమైనవని, అలాంటి ఇంకులతో టాటూలను పొడిపించుకోవడం వల్ల క్యాన్సరు వచ్చే ప్రమాదముందని బ్రిటన్‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూ వేసే సిరాలో ఐదుశాతం కార్సినోజెనిక్‌ పదార్ధాలున్నాయని, వాటివల్ల క్యాన్సరు వచ్చే ప్రమాదముందని వారు వివరిస్తున్నారు. కాబట్టి రకరకాల బొమ్మలను పచ్చబొట్టు పొడిపించుకునేటప్పుడు... వాటివల్ల తర్వాత వచ్చే ముప్పును గుర్తించి... ఆ తర్వాత పచ్చబొట్టు పొడిపించుకోండి!

  • Loading...

More Telugu News