: 30 క్షిపణులను ప్రదర్శించిన ఇరాన్
ఇరాన్-ఇరాక్ యుద్ధ వార్షికోత్సవం సందర్భంగా ఏటా నిర్వహించే ప్రదర్శనలో భాగంగా ఆదివారం ఇరాన్ రెండు వేల కిలోమీటర్ల శ్రేణికి చెందిన 30 క్షిపణులను ప్రదర్శించింది. ఇజ్రాయేలీ లక్ష్యాలను ఛేదించే ఉద్దేశంతో ఇన్ని క్షిపణులను ప్రదర్శించడం ఇదే తొలిసారి. వీటిలో 12 సెజిల్, 18 గదర్ క్షిపణులు ఉన్నాయి. రెండు వేల కిలోమీటర్ల శ్రేణి (పరిథి) లోకి అటు ఇజ్రాయేల్, ఇటు యూఎన్ స్థావరాలు కూడా వస్తాయి.