: ఎమ్మెల్యే చింతమనేనికి చేదు అనుభవం
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో రైతులు సమైక్యాంధ్ర సమరభేరి సభ ఏర్పాటుచేశారు. సమరభేరికి వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వేదికపైకి రావద్దంటూ రైతులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, రైతు సంఘం నాయకులు ఎర్నేని నాగేందర్ లు వేదికపై ఉన్నారు. దీంతో సమైక్యసభ అయితే తమ నేతను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో రైతు సంఘం నేతలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. గతవారం కేంద్ర మంత్రి కావూరి ఇంటిపై దాడికి పాల్పడ్డారంటూ చింతమనేనిపై కేసు నమోదైంది.