: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ


బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు మహారాష్ట్రకు అనుమతి మంజూరు చేసింది. 2.74 టీఎంసీలకు మించి గోదావరి నీటిని వాడుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. 

ఈ ప్రాజెక్టుపై పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర జలసంఘం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఒక్కొక్కరికి ఇందులో స్థానం ఉంటుంది. ఈ కమిటీ మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకే నీటిని వాడుకుంటుందా? లేదా? అనే విషయాలను పర్యవేక్షిస్తుంది. గోదావరిపై నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయితే శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులకు నీటి కరవు ఏర్పడుతుందని ఆందోళన నెలకొంది. 

  • Loading...

More Telugu News