: శరద్ యాదవ్ తో బాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి వివరించేందుకు ఆ పార్టీలో అన్ని ప్రాంతాల నేతలతో కలిసి ఆయన హస్తిన వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ మధ్యాహ్నాం బాబు, శరద్ యాదవ్ ను కలిశారు.