: ఒకే కాన్పులో పంచపాండవులు!


కాన్పులో ఒకరు లేదా కవలలు పుట్టడం మనకు తెలుసు. మరీ ప్రత్యేకం అనుకుంటే ముగ్గురు. అద్భుతాలు జరిగి నలుగురు పుట్టడం కాస్త అరుదుగా జరుగుతుంది. అయితే పాట్నా దగ్గర్లోని నవడా జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ ఏకంగా పంచపాండవులకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఐదుగురు బిడ్డల్లో ముగ్గురు పుట్టిన కాసేపటికే ప్రాణాలొదిలేశారు. ఒక బాబు, పాప మాత్రం తక్కువ బరువుతో ఉన్నా ప్రాణాలు నిలుపుకున్నారు. అంబికా గ్రామానికి చెందిన ఆమెను చూసేందుకు గ్రామస్తులు క్యూకడుతున్నా వైద్యులు అనుమతించడం లేదు.

  • Loading...

More Telugu News