: తనకు పుట్టలేదన్న అనుమానంతో కొడుకును విసిరేసిన తండ్రి


భార్యాభర్తల మధ్య గొడవలు దారుణాలకు కారణమవుతున్నాయి. చైనాలో దంపతలిద్దరు గొడవ పడ్డారు. దాంతో, భర్త తమ రెండేళ్ల పిల్లాడిని ఆరో అంతస్థు నుంచి విసిరేశాడు. ఆ బాలుడు తీవ్రంగా గాయపడి కన్నుమూశాడు. చైనాలోని గువాంగ్సి జువాంగ్ ప్రాంతంలో ఎవరో పిల్లాడు బిల్డింగ్ పై నుంచి పడిపోయాడని ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసులు ఆ పసివాడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసు దర్యాప్తులో ఎప్పట్లాగే తన భార్యతో మామూలుగా గొడవయ్యిందని కోపంతో తానే పిల్లాడిని తోసేశానని లు అనే అతను చెప్పాడు. ఆ బాలుడు తన వల్ల పుట్టలేదని అంటున్నాడు.

  • Loading...

More Telugu News