: రాష్ట్రపతి, రాజ్ నాథ్ సింగ్ లతో చంద్రబాబు భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ నేతల బృందం కూడా పాల్గొంది. అంతకుముందు పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ప్రణబ్ కు బాబు వివరించినట్టు సమాచారం.