: గవర్నర్ తో మంత్రి బాలరాజు సమావేశం
రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో మంత్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరిస్తున్నట్టు సమాచారం. కేంద్రం ప్రకటనల నేపథ్యంలో వేడెక్కుతున్న ఉద్యమ స్థితిగతులను, ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగబడే అవకాశాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.