: త్రిపురలో వామపక్షాల హవా.. నాగాలాండ్ లో కాంగ్రెస్ ముందంజ
మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం..
త్రిపురలో వామపక్షాలు ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. వరుసగా ఐదోసారీ వామపక్ష కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి 45 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాలు, ఇతరులు రెండు స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మొత్తం స్థానాలు 60.
నాగాలాండ్ లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఆధిక్యత కనబరుస్తోంది. 60 స్థానాలకుగాను, 15 స్థానాలలో ముందంజలో ఉండగా, ఇక్కడ కాంగ్రెస్ 4 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 60 స్థానాలకుగాను అత్యధికంగా 10 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు, యూడీపీ 5 చోట్ల, ఇతరులు మూడు స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.