: జస్టిస్ రమణపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు


రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు ఈ రోజు కొట్టివేసింది. అన్నిరకాల అంశాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పిటిషన్ ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. 
దురుద్దేశ పూర్వకంగా పిటిషన్ దాఖలు చేసినట్లుగా కోర్టు పేర్కొంది. కనుక గతంలోని కేసుల ఆధారంగా 
పిటిషనర్ కు 50 వేల రూపాయల జరిమానా విధించింది. విద్యార్థిగా వుండగా రమణపై కేసు నమోదైందని, ఆ విషయాన్నిదాచిపెట్టినందుకు జస్టిస్ రమణను హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్ కోరిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News