: ఓయూలో 'తెలంగాణ విద్యార్ధి యుద్ధభేరి'
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో 'తెలంగాణ విద్యార్ధి యుద్ధభేరి' సభ ప్రారంభమైంది. ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాదును కేంద్ర ప్రభుత్వం యూటీ చేయబోతోందంటూ వస్తున్న వార్తలపై మండిపడ్డ విద్యార్ధులు.. యూటీ చేస్తే రణరంగమేనని హెచ్చరించారు. ప్రస్తుతం సభ కొనసాగుతోంది. సభకు తెలంగాణ విద్యార్ధి నాయకులు, విద్యార్ధులు భారీగా హాజరయ్యారు.