: రేపిస్టు డాక్టర్ కు జీవిత ఖైదు
'వైద్యో నారాయణో హరి' అన్నారు పెద్దలు. అలాంటిది, దేవుడిలా సేవలు అందించాల్సిన వైద్యుడే రోగుల పాలిట కీచకుడిగా మారి వారి మానాన్ని హరిస్తే వాడికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? అలాంటి కీచక వైద్యుడికి బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. థానేలో విశాల్ వన్నే అనే వైద్యుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో రోగిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జనరల్ వార్డులో ఉన్న మహిళా రోగిని నైట్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విశాల్ ఐసీయూకి తరలించి మరీ అత్యాచారం చేశాడు. ఈ కేసులో అతని నేరం రుజువు కావడంతో ముంబై ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో నిందితుడు విశాల్ హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుడు నేరం చేశాడన్న ప్రాసిక్యూటర్ ఉషా కేజ్రివాల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అప్పీలు తిరస్కరించింది.