: కోలుకుంటున్న దిలీప్ కుమార్
బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ (90) అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జి అవుతారని సమాచారం. ఆదివారం ఆయనకు గుండె నొప్పి రావడంతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి దిలీప్ కుమార్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ పరిస్థితి నిలకడగా ఉందని ఆయన భార్య సైరాబాను మేనేజర్ ముర్షీద్ ఖాన్ తెలిపారు.