: ఈనెల 24న తిరుమల కొండపైకి వాహనాల బంద్


తిరుమల శ్రీవారికి మరోసారి సమైక్య సెగ తగలనుంది. ఈ నెల 24న కొండపైకి వాహనాలు తిరగనివ్వబోమని ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి తిరుపతిలో వెల్లడించారు. ఇందుకు శ్రీవారి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు తిరుపతిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు. అవసరమైతే ఇతర ప్రాంతాల భక్తులకు తిరుపతిలోనే ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

  • Loading...

More Telugu News