: హ్యాట్రిక్ తో సత్తా చాటిన రస్సెల్


బెంగళూరులో జరుగుతున్న భారత్-ఏ, విండీస్-ఏ జట్ల మ్యాచ్ లో కరీబియన్ బౌలర్ ఆండ్రీ రస్సెల్ హ్యాట్రిక్ సాధించి సత్తా చాటాడు. ఆరంభ ఓవర్లలో ఏమాత్రం ప్రభావం చూపని రస్సెల్ 18 వ ఓవర్లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. మంచి ఊపుమీద ఉన్న భారత్ ఇన్నింగ్స్ లో భారీ కుదుపు తీసుకొచ్చాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. చెలరేగి ఆడుతున్న జాదవ్ ను తొలి బంతికి ఔట్ చేసిన రస్సెల్, తరువాతి బంతికి మంచి ఫాంలో ఉన్న యువీని పెవిలియన్ బాటపట్టించాడు. మూడో బంతికి నమన్ ఓజాను బలితీసుకున్నాడు. నాల్గో బంతికి యూసఫ్ పఠాన్ ను కూడా అవుట్ చేశాడు. రస్సెల్ విన్యాసాలతో కరీబియన్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. దీంతో, భారత జట్టు కేవలం 214 పరుగులకే పరిమితమైంది.

  • Loading...

More Telugu News