: చెలరేగిన యువీ, జాదవ్.. భారత్-ఏ 214/7


బెంగళూరులో విండీస్-ఏ తో భారత-ఏ టీ20 మ్యాచ్ లో.. భారత్-ఏ బ్యాటింగ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యువరాజ్ జట్టు చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత జట్టులో కేవలం 35 బంతుల్లో 52 పరుగులు సాధించి కెప్టెన్ ఇన్నింగ్స్ తో యువీ ఆకట్టుకోగా.. అతనికి దీటుగా చెలరేగి ఆడి కేవలం 21 బంతుల్లో 42 పరుగులు సాధించి జాదవ్ సత్తా చాటాడు. ఓపెనర్లు ఊతప్ప(35), ఉన్ముక్త్ చాంద్(47) చక్కటి శుభారంభం ఇవ్వడంతో దాన్ని కొనసాగిస్తూ యువీ, జాదవ్ చెలరేగారు. దీంతో భారత్-ఏ జట్టు 214 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్(0), నమన్ ఓజా(0), అపరాజిత్(3) లు విఫలమయ్యారు. కాగా విండీస్ బౌలర్లలో నర్స్(2), రస్సెల్(4) లు రాణించారు.

  • Loading...

More Telugu News