: సమ్మె ఎక్కువకాలం కొనసాగటం మంచిదికాదు: హైకోర్టు
ఏపీఎన్జీవోల సమ్మె ఎక్కువకాలం కొనసాగటం మంచిదికాదని హైకోర్టు ఏపీఎన్జీవోలకు సూచించింది. సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు కూడా జరిగిన వాదనల సమయంలో కోర్టు ఎన్జీవోలకు పలు సూచనలు చేసింది. సమ్మె చాలా రోజులు సాగిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల ఇబ్బందులను కోర్టు సావధానంగా పరిశీలిస్తోందని తెలిపింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.