: ఆటోనగర్ లో లగడపాటికి సమైక్య సెగ
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీమాంధ్రలో అడుగడుగునా సమైక్య సెగ తగులుతోంది. వారి రాజీనామాల కోసం సమైక్యవాదులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నేడు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ ఆటోనగర్లో సమైక్యాంధ్ర దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు వెళ్ళిన లగడపాటిని ఉద్యమకారులు అడ్డుకున్నారు. రాజీనామా చేసిన తర్వాతే ఆందోళనల్లో పాలుపంచుకోవాలని నినదించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. లగడపాటి వర్గీయులు, సమైక్యవాదుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి లగడపాటిని అక్కడినుంచి పంపించివేశారు.