: ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో మరో ఎమ్మెల్యే అరెస్టు
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అరెస్టయ్యారు. అల్లర్లపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇదే కేసులో నిన్న బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రానా అరెస్టైన సంగతి తెలిసిందే.