: సర్పంచి ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం సర్పంచి రామారావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 5 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. రామారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సర్పంచి ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.