: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయాన్నే బయల్దేరి వెళ్లిన బాబు వెంట పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎల్.రమణ, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల, కేఈ కృష్ణమూర్తి, కోడెల శివప్రసాద్, అయ్యన్నపాత్రుడు తదితరులు ఉన్నారు. నేడు బాబు రాష్ట్రపతితో సమావేశమవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితి, జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంపై జాతీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందని పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు.