: నేడు విశాఖలో 'సమైక్య గర్జన'
సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. తమ మనోభావాలు ఢిల్లీ పెద్దలకు చేరేలా వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టీల్ సిటీ విశాఖలో ఈ రోజు 'విశాఖ సమైక్య గర్జన' జరపనున్నారు. ఈ సభ ఆర్కే బీచ్ లో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గర్జన సభ జరగనుంది. ఈ సభకు ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులతో పాటు 55 జేఏసీలు మద్దతిచ్చాయి. సభకు వచ్చేవారు తమ వాహనాలను ఏయూ మైదానం, తుపాను హెచ్చరికల కేంద్రం వద్ద నిలపాలని నిర్వాహకులు కోరారు.