: గూగుల్ క్రోమ్ కు పోటీగా 'ఎక్స్ ప్లోరర్ 10' ప్రవేశ పెట్టిన మైక్రోసాఫ్ట్
మరోసారి కంప్యూటర్ దిగ్గజాల మధ్య పోటీకి తెరలేచింది. ఇంటర్ నెట్ బ్రౌజర్ రంగంలో గూగుల్ ప్రవేశ పెట్టిన క్రోమ్ కు దీటుగా మైక్రోసాఫ్ట్ సంస్థ తన కొత్త వెర్షన్ ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 10ని మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రస్తుతం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే వెర్షన్ ను ప్రవేశపెట్టామని, విండోస్ 8 అనుకూల వెర్షన్ ను వచ్చే అక్టోబరులో విడుదల చేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కాగా, తాజా ఉత్పత్తి తమను మళ్లీ ప్రపంచ మార్కెట్లో ఉన్నత స్థానానికి తీసుకెళుతుందని మైక్రోసాఫ్ట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.